నా లాగే జీరో నుంచి హీరోగా ఎదిగారు : రవితేజ (ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 'బలుపు'చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్నిపర్ల్ వి. పొట్లూరి సమ్పరణలో పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. శృతి హాసన్, అంజలి హీరోయిన్లు.
బలుపు లోగో ఆవిష్కరణ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ 'ఈ చిత్ర నిర్మాత ప్రసాద్ వి. పట్లూరి నా లేగే జీరో నుంచి హీరోగా ఎదిగారు. ఆయనంటే ఎంతో అభిమానం. అందుకే ఈ సినిమా చేస్తున్నాను. హీరోయిన్లు శృతి హాసన్, అంజలి ఎంతో అందంతో పాటు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. గోపీచంద్ ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా సినిమాను తెరకెక్కించారు. కోన వెంకట్ సృష్టించిన పాత్రలంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన రాసిన చాలా పాత్రల్లో నటించాను. ఈ సినిమాలో కూడా పాత్ర కూడా బాగా నచ్చింది. థమన్ అందించే సంగీతం సినిమాకు హైలెట్ అవుతుంది' అన్నారు.

బలుపు మూవీ లోగో లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ గ్రీన్ లాండ్స్ లోని మారి గోల్డ్ హోటల్ లో నిర్వహించారు.

బలుపు లోగో ఆవిష్కరిస్తున్న దృశ్యం.

హీరోయిన్లతో రవితేజ

శృతి హాసన్, రవితేజ, గోపీచంద్ మలినేని

రవితేజ, గోపీచంద్

అంజలి, శృతి హాసన్
దర్శకుడు గోపీచంద్ మాట్లాడుతూ....రవితేజ సినిమా ప్రేక్షకులు ఎలా ఉండాలని కోరుకుంటారో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. రవితేజతో నా తొలి సినిమా జీవితాంతం గుర్తుంచుకుంటాను. డాన్ శ్రీనులో రవితేజ క్యారెక్టర్ ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఇందులో శృతి హాసన్ క్యారెక్టర్ ఎనర్జిటిక్ గా ఉంటుంది. శృతి హాసన్, బ్రహ్మానందం, రవితేజ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. అదే విధంగా అంజలికి పాత్రకు ఆమె తప్ప మరెవరూ సూట్ కాదరు. చాలా బాగుంటుంది ఆమె పాత్ర అని చెప్పుకొచ్చారు.
ప్రసాద్ వి. పొట్లూరి మాట్లాడుతూ...రవితేజ నా స్కూల్ మేట్, స్వయం శక్తితో పైకొచ్చారు. మా సంస్థ తొలి తెలుగు సినిమా ఆయనతో చేయడం ఆనందంగా ఉంది అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ బలం లేక పోయినా బలుపు ఉండాలనే పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా అతని పాత్ర ఉంటుందని తెలిపారు.
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి కథ, మాటలు : కోన వెంకట్, కె. ఎస్. రవీంద్ర, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల, ఫైట్స్ : స్టన్ శివ, కొరియోగ్రఫీ : రాజు సుందరం, బృందం, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్ : గౌతం రాజు, సినిమాటోగ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : థమన్, నిర్మాత : పరమ్ వి. పొట్లూరి.


Click it and Unblock the Notifications











