రవితేజ ‘నిప్పు’లో బహ్మానందం కాశీ పాత్రలో కేక..
మాస్ మహారాజ్ రవితేజ, సెక్సీ బ్యూటీ దీక్ష సేథ్ జంటగా రూపొందుతున్న చిత్రం 'నిప్పు'. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు పతాకంపై వైవిఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. ఫుల్ మాస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం....ఈ సినిమాలో అభిమానులను, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా జోడించారని తెలుస్తోంది. మరి తెలుగులో కడుపుబ్బా నవ్వించే కామెడీ స్టార్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బ్రహ్మానందమే. గతంలో రవితేజ-బ్రహ్మానందం కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి.ఈ సినిమాలో బ్రహ్మానందం కాశీ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇద్దరి మధ్య కడుపు చెక్కలయ్యే రేంజ్ లో కామెడీ సీన్లను ఉంటాయని అంటున్నారు.
వీర సినిమా ప్లాపు తర్వాత చాలా కేర్ తీసుకున్న రవితేజ 'నిప్పు'తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. గుణ శేఖర్ కూడా వరుస ప్లాపుల తర్వాత నిప్పు చిత్రం చేస్తున్నాడు కాబట్టి పక్కా స్క్రిప్టుతో ఈసినిమాను తెరకెక్కించాడని అంటున్నారు. మరి 'నిప్పు' వెలుగు ఏ రేంజ్ లో ఉంటుందో ఫిబ్రవరి 2న తేలనుంది.


Click it and Unblock the Notifications











