భరత్ రాజు మృతి (ప్రమాదం ఫొటోలు): మొదటినుంచీ వివాదాలే, మరణం లోనూ అనుమానాలే
రవితేజ సోదరుడు భరత్ రాజు మృతి చెందారు, ప్రమాదంలో భరత్ ముఖం గుర్తుపట్టలేని విధంగా చిద్రమైంది. భరత్ రాజు నటుడిగా కంటే ఒక వివాదాస్పద వ్యక్తిగానే చాలా మందికి తెలుసు.
భరత్ రాజు ఒకనటుడిగా కంటే హీరో రవి తేజా తమ్ముడిగానూ ఇండస్ట్రీలో ఒక వివాదాస్పద వ్యక్తిగానే చాలా మందికి తెలుసు. ప్రముఖ సినీ నటుడు రవితేజగా అతి కష్టం మీద ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యున్నత శిఖరాలను అదిరోహిస్తుంటే తన తమ్ముళ్ళు మాత్రం డ్రగ్స్ కేసుల్లోనూ, వివాదాల్లోనూ నిలుస్తూ వచ్చారు.

మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు
రవితేజ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సోదరులు కూడా చిన్న చిన్నపాత్రల్లో నటించేవారు. అయితే భరత్ కెరీర్‌లో నటించింది కొన్ని సినిమాల్లో అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వచ్చిన సినిమాల్లో కూడా భరత్ నటించాడు. కానీ అనుకున్నంత సక్సెస్ కాకపోవటం తో నిరాశతోనూ, డిప్రెషన్ వల్లా డ్రగ్స్ కి బానిసయ్యాడని అంటారు.

భరత్ రాజు, రఘునాథ రాజు
భరత్ రాజు, రఘునాథ రాజు, గతం లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. క్లెమెన్ అనే నైజీరియన్ నుంచి కొకైన్ అనే మాదక ద్రవ్యం కొనుగోలు చేస్తుండగా పోలీసులు వారిని రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ కేసులో దాదాపు పదేళ్ళ వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నా కొన్ని ప్రయత్నాలతో కొంత వరకూ శిక్ష నుంచి తప్పించుకున్నారు.

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి
రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక బెయిల్ కోసం ఓసారి ప్రయత్నించి విఫలమైన రవితేజ సోదరులకు ఎట్టకేలకు బెయిల్ లభించినా, బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతుల్ని కూడా విధించడంతో, నిబంధనలకు లోబడి వీరిద్దరూ బాహ్య ప్రపంచంలో తిరగాల్సి వచ్చింది.

తిరుమల కొండపై సిగరెట్
తిరుమల కొండపై అతను సిగరెట్ కాలుస్తున్నప్పుడు మీడియా కంట పడ్డాడు. మీడియాను చూడగానే సిగరెట్ విసిరేసి కాస్త దూరంగా వెళ్ళి దాక్కున్నాడట. అది మాములు సిగరెట్టా?లేక నార్కోటిక్ దట్టించిన సిగరెట్టా? అనే విషయం పై కూడా చాలా అనుమానాలే ఉన్నా అప్పట్లో మీడియా వరకూ ఆ విశయం చేరకుండా జాగ్రత్త పడ్డారు.

తప్పతాగి కారు డ్రైవ్ చేస్తూ
ఆతర్వాత భరత్ మళ్ళీ ఒకసారి తప్పతాగి కారు డ్రైవ్ చేస్తూ గర్ల్ ఫ్రెండ్ తో సహా దొరికిపోయాడు. మామూలుగానే ఒక న్యూస్ ని వందసార్లు చూపించే ఛానల్స్ వారు ఇలాంటి న్యూస్ దొరికితే వదులుతారా? రోజంతా అదే చూపిస్తారు. తాజాగా డ్రగ్ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన ఈ సోదరులిద్దరు మీడియాపై విరుచుకుపడ్డారు.

పదే పదే టివిలో చూపించారు
కేసు విషయం వారితో మాట్లాడేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను బండబూతులు తిడుతూ వెళ్లిపోయారు. దీన్ని కూడా పదే పదే టివిలో చూపించారు. సోదరుల వ్యవహారం తలనొప్పిగా మారడంతో అప్పట్లో రవితేజ కూడా చాలానే ఇబ్బంది పడ్డాడు.

పరువు తీసుకున్నాడు
డ్రగ్స్ సేవిస్తూ, పవిత్రమైన తిరుమలలో సిగరెట్ దమ్ము లాగుతూ... ఇలాంటి వెకిలి చేష్టలతో తన పరువు ఎలాగో తీసుకున్నాడు. కనీసం తన అన్న, టాలీవుడ్ మాస్ హీరో రవితేజ పరువైనా కాపాడాడా అంటే అదీ లేదు. చేసిన తప్పే పదేపదే చేస్తూ చిల్లర వేషాలు వేస్తూ వివాదాస్పదంగానే జీవించాడు.

డ్రగ్స్ కూడా తీసుకొని ఉండొచ్చు
ఇప్పుడు భరత్ మరణం కూడా పలు అనుమానాలకు తావిచ్చేది గానే ఉంది. ఆసమయం లో కూడా ఆయన మితిమీరి తాగిన స్థితిలోనే ఉండొచ్చనీ, లేదా డ్రగ్స్ కూడా తీసుకొని ఉండొచ్చనీ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సనివారం రాత్రి ప్రమాదం జరిగితే చాలా సేపటి వరకూ పోలీసులకు కూడా తెలియకుండా ఉంచటానికి ఆయన మితృలు ప్రయత్నించటం పలు అనుమానాలకు తావిస్తోంది.

చాలా గోప్యంగా ఉంచారు
శనివారం రాత్రి 10గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భరత్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన మిత్రులు మాత్రం ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు.! ఇంత వరకూ అసలెందుకు గోప్యంగా ఉంచారు.. ? గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి.! కాగా అరగంట క్రితం పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టారు.

శనివారం రాత్రి 10 గంటలకు
శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఆగిఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న స్కోడా కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం శనివారం రాత్రి 10 గంటలకు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో భరత్ ముఖం గుర్తుపట్టలేని విధంగా చిద్రమైందని, అందుకే ఆయన రవితేజ సోదరుడని గుర్తించలేకపోయామని పోలీసులు చెప్పారు.

ఉస్మానియా ఆసుపత్రిలో
కారు నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులు భరత్‌ను గుర్తించారని పోలీసులు చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం భరత్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో భరత్ ఒక్కరే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications











