twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ తమ్ముడుతో ఆమె?

    By Staff
    |

    Saira Banu
    రవితేజ తమ్ముడు భరత్ రూమ్ లో టీవీ యాంకర్ నుండి సినీ నటిగా మారిన సైరాబాను ఉంటోందని ఫిల్మ్ నగర్ లో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఎంతోకాలంగా ఈ వ్యవహారం నడుస్తోందని, పబ్ ల నుండి, నైట్ క్లబ్ ల దాకా ఎక్కడ చూసినా వీరే కన్పడతున్నారని చెప్పుకుంటున్నారు. అంతేగాక ఇద్దరూ ఒకే రూమ్ లో కలసి ఉంటున్నారని, ఎవరైనా అడిగితే అపార్ధం చేసుకోవద్దని అర్ధం చేసుకోవటానికే లివ్-ఇన్-రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తున్నామని చిలుకపలుకులు వల్లిస్తున్నారని అంటున్నారు.

    ఈ మధ్యనే ఎఫ్ బార్ లో వీళ్ళిద్దరూ కలసి డాన్స్ చేసారని, అదే సమయంలో పరిచయస్తులైన సినిమావాళ్ళు అక్కడ పలకరిస్తే...ఆమెను తీసుకువచ్చి పరిచయం చేసాడని అంటున్నారు. అంటే ఈ సంభంధాన్ని అఫీషయల్ గానే కొనసాగించటానికి ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. రవితేజ కూడా ఈ విషయంలో చూసిచూడనట్లు ఉంటున్నాడని చెప్తున్నారు. ఇక ఆమె కూడా త్వరలోనే అతన్ని పెళ్ళిచేసుకోనున్నట్లు బిహేవ్ చేస్తోందని ఆమె శ్రేయాభిలాషులు చెవులు కొరుక్కుంటున్నారు. ఏదైమైనా పేజి త్రి సంగతులు కొద్దిగా గమ్మత్తుగా ఉంటుందని, అయితే కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే రాబోయే చాలా ప్రమాదాలు తప్పుతాయని సీనియర్స్ సలహాలు ఇస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X