హిట్ కోసం ‘నిప్పు’ తో చెలగాటమాడుతున్నాడు..!
దొంగలముఠా, వీర వరుసగా ప్లాప్ కావడంతో రవితేజ మళ్ళీ ఓ మంచి హిట్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం రవితేజ 'నిప్పు" షూటింగ్ లో బిజీగా వున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో వైవియస్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం పైనే రవితేజ ఆశలు పెట్టుకున్నాడు. హైదరాబాద్, వికారాబాద్ లలో గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా అందులో ఒక హీరోయిన్ గా దీక్షాసేథ్ ఓకే అయింది. మరో హీరోయిన్ ఫైనల్ కావాల్సి ఉంది.
ఇప్పటి వరకు వచ్చిన రవితేజ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం వుంటుందని తెలుస్తోంది. ఒకే తరహా క్యారెక్టరైజేషన్ తో, స్లాంగ్ తో రవితేజ చేసిన సినిమాలకు ఇది పూర్తి డిఫరెంట్ గా వుంటుందని సమాచారం. ఫస్ట్ టైమ్ రవితేజ, గుణశేఖర్, వైవియస్ చౌదరి సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్నందిస్తున్నారు.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ మరో రెండు సినిమాలు చేయనున్నాడు. త్వరలోనే 'ఇడియట్-2' సెట్స్ పైకి వెళ్లనుంది. అది కాక ఇప్పుడు మరోసినిమాకి అంగీకరించాడు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్స్ సంస్ద ఈ సినిమాకు శ్రీకారం చుట్టింది. 'శౌర్యం'తో తన స్టైల్ చూపెట్టిన దర్శకుడు శివ దీనికి దర్శకత్వం వహించనున్నాడు. బూరుగుపల్లి శివరామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











