రవితేజను తెలివిగా ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ లో ఇరికించిన నిర్మాత...
మొన్న ఆ మద్య కాలంలో రవితేజ హీరోగా కృష్ణవంశి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మాతగా కందిరీగ చిత్రం కమిటయిన సంగతి తెలిసిందే. తర్వాత ఆ చిత్రం కాన్సిల్ అయినట్లు సమాచారం. అయితే దానికి సరైన కారణాలు ఏతీ తెలియలేదు. కాగా తాజా సమాచారం ప్రకారం హీరో రవితేజను ఓ ల్యాండ్ కు సంబంధించి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మోసం చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కుకట్ పల్లిలో గల 2000 స్క్వయర్ యార్డ్ భూమిని రవితేజకు బెల్లంకొండ సురేష్ అమ్మాడట.
దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిపోయింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ట్రాన్సాక్షన్ అన్నీ ఇన్ వ్యాలిడ్ అని తేలింది. కానీ ఈ ల్యాండ్ హక్కులు రవితేజకు చెందినవనిగా ముద్రీకరించడంతో, అది ఇన్ కమ్ ట్యాక్స్ పరిధిలో ఉందని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ రవితేజ కు నోటీసులు పంపించారట. ఈ నోటీసులు అందుకున్న రవితేజ షాక్ అయ్యాడని సమాచారమ్. బెల్లకొండ సురేష్ తనని మోసం చేసాడని గ్రహించిన రవితేజ దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలా? అనే ఆలోచనలో పడినట్టు సన్నిహితుల నుండి వచ్చిన సమాచారం


Click it and Unblock the Notifications











