స్టార్ హీరో రవితేజ ఇక 'కత్తిలాంటోడు'
రవితేజ మరో కొత్త చిత్రం కమిటయ్యారు. రెయిన్‌బో రీల్స్ అనే నూతన సంస్థ ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం కానుంది. ఇక ఈ చిత్రానికి 'కత్తిలాంటోడు' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసి ఫిల్మ్ ఛాంబర్ లో రిజస్టర్ చేసారు. టైటిల్ బయిటకు రాగానే మంచి క్రేజ్ వచ్చింది. రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిరపకాయ, రమేష్ వర్మ దర్శకత్వంలో వీర సినిమాలు చేయనున్నారు. అలాగే గోపీచంద్ అనే నూతన దర్శకుడుతో చేస్తున్న 'డాన్‌శీను' చిత్రం ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోంది. ఈ 'కత్తిలాంటోడు' సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
More from Filmibeat
రవితేజ డాన్ శీను కత్తిలాంటోడు ఇడియట్ వెంకీ విక్రమార్కుడు మిరపకాయ్ వీర రెయిన్‌బో రీల్స్ raviteja kick vikramarkudu don srinu mirapakai veera rainbow reels kattilantodu


Click it and Unblock the Notifications











