రవితేజ 'దరువు' రిలీజ్ డేట్ ఖరారు
రవితేజ,తాప్సీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'దరువు'. శౌర్యం శివ దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో క్లైమాక్స్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో నిర్మాత మాట్లాడుతూ ''రవితేజ హావభావాలకు సరిపడే కథ ఇది. మాస్‌ని ఆకట్టుకొనే అంశాలున్నాయి. బ్యాంకాక్, రామోజీ ఫిల్మ్‌సిటీల్లో రెండు షెడ్యూళ్లు పూర్తిచేశాం. ఈనెల 16 వరకూ చిత్రీకరణ జరుపుతాం. ఏప్రిల్‌లో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి, మే 4న సినిమాని విడుదల చేస్తాము''అన్నారు.
ఇక ఈ చిత్రం కథ గురించి చెపుతూ..ఎవరితోనైనా గొడవకు దిగండి. కానీ మాస్‌తో పెట్టుకోకండి. వాళ్ల దగ్గర కాస్త పొగరు ఎక్కువ. ఆనందం వచ్చినా, ఆవేశం వచ్చినా తీన్‌మార్ ఆడేస్తారు. ఆ కుర్రాడూ అంతే. నోటితో పోయేదాన్ని, చేతి దాకా తెచ్చుకొంటాడు. గొడవకు దిగడం అంటే మహా సరదా. ఇంతకీ అతగాడి కథేమిటో తెలియాలంటే 'దరువు' సినిమా చూడాల్సిందే అన్నారు. ఇక 'దరువు'చిత్రానికి 'సౌండ్ ఆఫ్ మాస్' అనేది ట్యాగ్ లైన్. సంగీతం: విజయ్ ఆంథోని, సమర్పణ: నాగమునీశ్వరి.


Click it and Unblock the Notifications











