దిల్‌ రాజుకే 'దరువు'

By Srikanya

వరసగా గబ్బర్ సింగ్,రచ్చ సినిమా రైట్స్ తీసుకున్న దిల్ రాజు మరోసారి ఓ పెద్ద చిత్రం రైట్స్ తీసుకుని వార్తల్లో కెక్కారు. తాజాగా రవితేజ, తాప్సీ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'దరువు'ని దిల్ రాజు భారీ మొత్తం ఇచ్చి తీసుకున్నారు. అయిదు కోట్లకు పొందినట్టు టాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రానికి 'శౌర్యం' ఫేమ్‌ శివ దర్శకత్వం వహిస్తూండగా, బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. విజయ్‌ ఆంటోనీ సంగీతం అందిస్తూండగా, ప్రభు, సత్యనారాయణ, షాయాజీషిండే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, అవినాష్‌, రఘుబాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ మార్చి 25కు పూర్తవనుండగా, మే నాలుగున విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక రామ్‌చరణ్‌ తేజ 'రచ్చ' చిత్రం నైజాం హక్కులను దాదాపు రూ.9.6 కోట్లకు ఆయన కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రవితేజ వరస ప్లాపుల తర్వాత వస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంపై రవితేజకు చాలా నమ్మకం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X