సెక్సీ బ్యూటీతో రవితేజ మజారే.. మజారే!
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా 'నిప్పు' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దీక్ష సేథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, వైవిఎస్ చౌదరి బొమ్మరిల్లు పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిప్పు చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. 'మజారే మజారే' అనే పాటకు రవితేజ, దీక్ష సేథ్ రొమాంటిక్ స్టెప్స్ వేస్తున్నారు. ఈ పాటను చాలా హాట్ హాట్ గా, శృంగార భరితంగా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. రాజు సుందరం కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
నిప్పు చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 19న ఆడియో, ఫిబ్రవరి 2న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలో రవితేజ క్యారెక్టరైజేష్ హైలెట్ గా నిలువనుంది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఉన్నప్పటికీ... హింసాత్మక, వెగట పుట్టించే సీన్లు లేవని గతంలోనే దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, ఎడిటింగ్: గౌతం రాజు.


Click it and Unblock the Notifications











