మిరపకాయ్ పోరితో టర్కీ చెక్కేస్తున్న రవితేజ...!

By Sindhu

'వీర' సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న మరో మాస్ ఎంటర్‌టైనర్ 'నిప్పు". దీక్షాసేథ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. ప్రముఖ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ ' రవితేజ, గుణశేఖర్‌ల కలయికలో యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందుతున్న చిత్రమిది. బ్యాలెన్స్ పాటలను ఈ నెల 11 నుంచి 20 వరకు టర్కీలోని అందమైన లొకేషన్స్‌ లో చిత్రీకరించనున్నాం అన్నారు.

రవితేజ బ్రాండ్ ఎంటర్ టైన్మెంట్ తో బాటు, గుణశేకర్ సినిమాలలో వుండే కథాబలం, సాకేతిక విలువలు ఇందులో ఉంటాయని నిర్మాత చెప్పారు. ఈ నెల 13న ఆడియోను విడుదల చేసి జనవరి 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం" అన్నారు. డా.రాజేంవూదవూపసాద్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రదీప్‌ రావత్, బ్రహ్మానందం, కృష్ణుడు, ధర్మవరపు సుబ్రమణ్యం, ముకుల్‌దేవ్, బ్రహ్మాజీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: ఆకుల శివ, సంగీతం: తమన్, కెమెరా: సర్వేష్ మురారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.ఆర్.కిషోర్, సహ నిర్మాత: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X