రవితేజ కోసం క్యూలో ఉన్న క్రేజీ చిత్రాలు.. డ్యూయెల్ రోల్ లో మరో సినిమా!
మాస్ మహారాజ రవితేజ నటించిన నేల టిక్కెట్టు చిత్రం ఆశించిన స్థాయి ఫలితం ఇవ్వలేకపోయింది. ఆడియన్స్ ని మెప్పించడంలో ఈ చిత్రం విఫలమైంది. అయినా కూడా రవితేజ కోసం వరుస చిత్రాలు క్యూ కడుతున్నాయి. రవితేజ, శ్రీనువైట్ల సూపర్ హిట్ కాంబినేషన్ లో చాలాకాలం తరువాత ఓ చిత్రం రాబోతోంది. అమర్ అక్బర్ ఆంటోని అనే ఈ చిత్రంలో రవితేజ త్రిపాత్రాభినయంలో నటించబోతున్నాడు.
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇదిలా ఉండగా విఐ ఆనంద్ దర్శకత్వంలో మరో చిత్రానికి రవితేజ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో విఐ ఆనంద్ గుర్తింపు పొందారు. రవితేజ కోసం డ్యూయెల్ రోల్ లో ఓ కథ తెలుస్తోంది. రవితేజ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో మారు రవితేజ డ్యూయెల్ రోల్ లో నటించేందుకు రంగం సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











