»   » హీరోయిన్ మీద లైంగిక దాడి: భగ్గుమన్న రవితేజ, కోసేయాలి...

హీరోయిన్ మీద లైంగిక దాడి: భగ్గుమన్న రవితేజ, కోసేయాలి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మళయాల నటిపై జరిగిన లైంగిక దాడి ఘటన సినీ రంగం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటనపై స్టార్స్ అందరూ ఆమెకు తమ మద్దతు ప్రకటించడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

లైంగిక దాడికి గురైన సదరు నటి తెలుగులో ఒంటరి, మహాత్మ చిత్రాల్లో హీరోయిన్ గా నటించంది. రవితేజ నటించిన 'నిప్పు' చిత్రంలో ఆ నటి ఓ చిన్న గెస్ట్ రోల్ చేసింది. తనతో కలిసి నటించి ఆమెకు ఇలాంటి సంఘటన ఎదురైన విషయం తెలియగానే హీరో రవితేజ సోషల్ మీడియా ద్వారా భగ్గుమన్నారు.

రవితేజ

రవితేజ

ఆ సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే కోపంతో రక్తం మరిగిపోయింది. ఇలాంటి సంఘటనలపై ఎలా రియాక్ట్ కావాలో తెలియడం లేదు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారినిసౌదీలో మాదిరిగా క్రూరంగా శిక్షించాలి అని రవితేజ అభిప్రాయ పడ్డారు.

తుపాకీతో కాల్చి చంపాలి

తుపాకీతో కాల్చి చంపాలి

తమిళ నటుడు విశాల్ స్పందిస్తూ ‘ప్రఖ్యాత నటుడు అయ్యుండీ ఇలాంటి ఘటన గురించి ధైర్యంగా బయటకు చెప్పడం ఎంతో గొప్ప విషయం. సెలబ్రిటీలకే రక్షణలేక పోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఈ విషయమై నడిగర్ సంఘం తరుపున కేరళ ముఖ్యమంత్రికి ఓ లేఖ రాసాము. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరాము. ఇలా లైంగిక వేధింపులకు పాల్పడే వారిని తుపాకీతో కాల్చి చంపాలని' అని విశాల్ ఫైర్ అయ్యారు.

ఇలాంటి వారు సమాజానికి అనవసరం

ఇలాంటి వారు సమాజానికి అనవసరం

కన్నడ నటుడు సుదీప్‌ మాట్లాడుతూ.. ‘పర స్త్రీకి గౌరవం ఇవ్వలేని వ్యక్తి.. తన తల్లికి, చెల్లికి కూడా గౌరవం ఇవ్వడు. అలాంటి వాడు ఈ సమాజానికి అనవసరం. ఈ కేసుపై విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు విధించాలి' అన్నారు.

హీరో కూతురికి లైంగిక వేధింపులు: ఒళ్లు అమ్ముకోవడాకి రాలేదు, ఉరి తీయాలని వ్యాఖ్య!

హీరో కూతురికి లైంగిక వేధింపులు: ఒళ్లు అమ్ముకోవడాకి రాలేదు, ఉరి తీయాలని వ్యాఖ్య!

రెండు రోజుల క్రితం మళయల నటిపై జరిగిన దారుణ సంఘటన నేపథ్యంలో.... తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు, హీరోయిన్ వరలక్ష్మి తనకు జరిగిన లైంగిక వేధింపుల అంశాన్ని ట్విట్టర్ ద్వారా బయట పెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల్లో హీరో హస్తం, 30 లక్షల సుపారీ?

హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల్లో హీరో హస్తం, 30 లక్షల సుపారీ?

ఈ కేసులో మళయాల చిత్రపరిశ్రమకు చెందిన ఓ హీరోతో పాటు ఓ రాజకీయ నాయకుడికి చెందిన ఇద్దరు కుమారుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రవితేజ ఫ్యామిలీ ఫిక్, మూడు తరాలు ఇదిగో....(ఫోటోస్)

రవితేజ ఫ్యామిలీ ఫిక్, మూడు తరాలు ఇదిగో....(ఫోటోస్)

మాస్ మహరాజా రవితేజ అభిమానులతో ఓ అరుదైన ఫోటోను పంచుకున్నారు. తన ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు అంటూ తన తండ్రి, తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోను రవితేజ షేర్ చేసారు. ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

English summary
"I'm so angry that I don't know how to react to incidents of rape & brutality on women. Even Saudi way of treating culprits won't be enough" Mass Raja Raviteja expressed his anger on molestation of Malayalee Actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu