రాజా ది గ్రేట్: కట్టలు తెంచుకున్న రవితేజ ఫ్యాన్స్ ఆగ్రహం....
ముందుగానే డబ్బులు వసూలు చేసి బెనిపిట్ షోలు వేయక పోవడంతో రవితేజ ఫ్యాన్స్ ఆగ్రహానికి గరయ్యారు.సూర్యపేటలోని తేజ మూవీ మాక్స్ థియేటర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రవితేజ సినిమా థియేటర్లలోకి వచ్చింది. 'రాజా ది గ్రేట్' సినిమా అందరికంటే ముందే చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. భారీ రేట్లకు బెనిఫిట్ షోలు టిక్కెట్లు అమ్మినా ఏమాత్రం వెనకాడకుండా కొనుగోలు చేశారు. అయితే తీరా బెనిఫిట్ షో వేయక పోవడంతో.... రవితేజ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో థియేటర్ మీద దాడికి తెగబడ్డారు.
Recommended Video

సూర్యాపేట జిల్లాలోని తేజ మూవీ మ్యాక్స్ థియేటర్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. 'రాజా ది గ్రేట్' బెనిఫిట్ షో వేస్తామని ధియేటర్ యాజమాన్యం ప్రేక్షకుల నుండి ముందుగానే డబ్బులు వసూలు చేసింది. ఎందుకిలా చేశారని కొందరు అభిమానులు ప్రశ్నించడంతో యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది.

ఆగ్రహంతో ఊగిపోయిన అభిమానులు
యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో రవితేజ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. కొందరు థియేటర్లోకి చొచ్చుకెళ్లి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

రాజా ది గ్రేట్
రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజా ది గ్రేట్' సినిమాకు బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది. రవితేజ నటన ఈ సినిమాకి ప్రధాన బలమని చెబుతున్నారు. సినిమా హిట్టయ్యే అవకాశం కనిపిస్తోంది.

అంధుడి పాత్రలో అదుర్స్
అంధుడిగా రవితేజ అద్భుతంగా నటించాడని, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తో పాటు కామెడీ కూడా బాగా ఆకట్టుకుందనీ, ముఖ్యంగా 'గున్నా గున్నా మామిడి' ఎపిసోడ్ హైలైట్ గా నిలిచిందని చెబుతున్నారు.

కొందరు అలా
అయితే సినిమా కథ-కథనం కొత్తగా లేదని, సినిమా యావరేజ్ అని మరికొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఫస్టాఫ్ బావుందని, సెకండాఫ్ యావరేజ్ గా ఉందని అంటున్నారు. అయితే ఓవరాల్ గా సినిమా ఫర్వాలేదని టాక్.


Click it and Unblock the Notifications











