బోయపాటికి రవితేజా ట్విస్టు

By Staff

Ravi Teja
రవితేజ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో హాస్యనటుడు గణేష్ సినిమా చేయటానికి కమిటయ్యారనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ ఛేంజ్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. యువత చిత్రంతో పరిచయమైన పరుసరామ్ ఆ స్లాట్ లో ప్రవేశించినట్లు తెలుస్తోంది. పరుసరామ్, రవితేజ ల కాంబినేషన్ సినిమా ఈ నెల(మార్చి)ఇరవై మూడు ప్రారంభం కానుంది. ఇది బోయపాటికి మరో దెబ్బ. భద్ర సినిమాతో తానేంటో నిరూపించుకున్న బోయపాటి శ్రీను కి తులసి(వెంకటేష్) అనంతరం ఇప్పటివరకూ సినిమా లేదు.

ఆ మద్య బాలకృష్ణకు కథ చెప్పి ఒప్పించాడని వార్త వచ్చింది. ఆ తర్వాత అది మిస్సై మరో దర్శకుడు మహదేవన్ దర్శకత్వంలో మిత్రుడు మొదలైంది. అనంతరం జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారితో గోపీచంద్ హీరోగా అని ఆపీస్ సైతం తెరిచారు. కానీ గోపీచంద్ మళ్ళీ శౌర్యం శివతో సినిమా చేస్తూండంతో జెమినీ వారు పొల్లాదవాన్ రీమేక్ లో పడి బోయపాటికి హ్యాండు ఇచ్చారు. ఆ తర్వాత నాగార్జున హీరోగా కామాక్షి వారు కథ విని ఫైనలైజ్ చేసారు. అదీ వర్కవుట్ కాలేదు. ఇక ఇప్పుడు రవితేజ సినిమా సైతం తప్పుకుంది. ఇక పరుశరామ్ చెయ్యబోయే సినిమా నయనతార హీరోయిన్. దుబాయి శీను తర్వాత ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వటంతో కొంత క్రేజ్ ఏర్పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X