తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ మాస్ రాజా రవితేజ ఐదు షేడ్స్ లో ...!
మాస్ మహారాజ రవితేజ కథానాయకుడుగా సినిమాటోగ్రఫర్ నుండి దర్శకుడుగా మారిన'శౌర్యం' శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రెండో షెడ్యులు షూటింగు ఈ నిన్న హైదరాబాదులో మొదలైంది. ఇది నాన్ స్టాప్ గా షూటింగు పూర్తయ్యేవరకు కొనసాగుతుంది. హైదరాబాదుతో బాటు బదామి, బ్యాంకాక్ లలో ఈ షూటింగు జరుగుతుంది. హైదరాబాదు, చెన్నయ్ లలో జరిగిన తొలి షెడ్యులులో టాకీపార్ట్ షూట్ చేశామని దర్శకుడు చెప్పారు.
రవితేజ బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కథ తయారుచేయడం జరిగిందన్నారు. రవితేజ క్యారెక్టర్లో ఐదు షేడ్స్ ఉంటాయనీ, ఈ టైప్ క్యారెక్టర్ రవితేజ ఫస్ట్ టైమ్ చేస్తున్నారు. ఎ, బి, సి అనే తేడా లేకుండా అన్ని సెంటర్ల ఆడియన్స్‌కి నచ్చేలా ఈ సినిమా వుంటుంది. వినోదాన్ని కోరుకునే వారికి 100% వినోదం ఈ సినిమాలో దొరుకుతుందనీ దర్శకుడు చెప్పారు. పాటల్ని కూడా విదేశాలలో చిత్రీకరించి, వేసవిలో సినిమాని రిలీజ్ చేస్తామన్నారు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. రవితేజ, తాప్సీ ఇంతకు ముందు వీర చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. విజయ్ ఆంథోని మంచి మ్యూజిక్ ను అందించనున్నారు.
ప్రస్తుతం రవితేజ గుణశేఖర్ దర్శకత్వంలో 'నిప్పు' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వైవియస్ చౌదరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో దీక్షాసేత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేయుటకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











