ఫుట్‌బాల్ కోచ్‌గా రవితేజ
హైదరాబాద్: మాస్ మహారాజ రవితేజ హీరోగా పరుశు రామ్ దర్శకత్వంలో అశ్వినీ దత్ నిర్మిస్తున్న చిత్రం "సార్ వచ్చారు ". ఇందులో రవితేజ ఫుట్ బాల్ కోచ్ గా నటించనున్నారు. ఇటీవలే ఊటీలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది.
మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు . గతంలో రవితేజ-పరశురామ్ కాంబినేషన్లో 'ఆంజనేయులు' అనే ప్లాపు మూవీ వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు అశ్వినీదత్.
మరో వైపు రవితేజ 'బలుపు' అనే చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. గోపీచంద్ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో డాన్ శ్రీను చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ వి పొట్లూరి పివిపి సినిమా బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించన్నారు. ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
మినిమమ్ హిట్ గ్యారంటీ హీరోగా ఉన్న రవితేజను ఈ మధ్య వరుసగా ప్లాపులు పలకరిస్తున్నాయి. రవితేజ నటించిన వీర, నిప్పు, దొంగల ముఠా, దరువు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. తాజాగా రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.


Click it and Unblock the Notifications











