ఆమె నా డార్లింగ్, యూఎస్ఏలో బాగా ఎంజాయ్ చేశాం: రవితేజ

రవితేజ, ఇలియానా హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, చెరుకూరి మోహన్‌ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ మూవీ నవంబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.

కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ సినిమా వస్తుండటంతో ఈ వేడుకకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వారిని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా తనదైన ప్రసంగంతో మాస్ మహరాజ్ వారిలో ఉత్సాహం నింపారు.

ఆ రెండు కలిస్తే ఈ సినిమా

ఆ రెండు కలిస్తే ఈ సినిమా

అభిమానులంతా నా తమ్ముళ్లు... అంటూ వారిలో జోష్ నింపిన రవితేజ ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. మేము షూటింగ్ స్పాట్లో ఎంత నవ్వుకున్నామో... రేపు థియేటర్లో చూసి మీరు కూడా అంతే నవ్వుకుంటారు. మా కాంబినేషన్లో ఇది 4వ సినిమా. మొదటి మూవీ ‘నీకోసం' ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ, ఆ తర్వాత ఔట్ అండ్ ఔట్ ఎంటర్టెనర్ వెంకీ, దుబాయ్ శీను... ఆ రెండు చిత్రాల కలయిక అమర్ అక్బర్ ఆంటోనీ అని నేను నమ్ముతున్నాను. అది మీకు నచ్చుతుంది... అని రవితేజ వ్యాఖ్యానించారు.

హిట్టు ప్లాపుకు సంబంధం లేకుండా

హిట్టు ప్లాపుకు సంబంధం లేకుండా

హీరో ఆఫ్ ది ఈవినింగ్ తమన్...నాతో 9వ సినిమా, నెక్ట్స్ 10వ సినిమా కూడా చేస్తున్నాడు. హిట్టుకు ప్లాపుకు సంబంధం లేకుండా నాకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తాడు. మా బంధం ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నట్లు రవితేజ తెలిపారు.

ఇలియానా నా డార్లింగ్

ఇలియానా నా డార్లింగ్

ఇలియానా గురించి అప్పుడు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను. ఆమె నా డార్లింగ్. ఇకపై కూడా కలిసి చేస్తాం. ఇద్దరం ఎప్పుడు కలిసి పని చేసినా చాలా ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమా కోసం యూఎస్ఏలో దాదాపు నెల రోజులు ఎంజాయ్ చేశామని రవితేజ అన్నారు.

శ్రీను వైట్ల గ్రేట్ యాక్టర్

శ్రీను వైట్ల గ్రేట్ యాక్టర్

శ్రీను వైట్ల గురించి చెప్పాలంటే.. అతడి కామెడీ, సెన్సాఫ్ హ్యూమర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గ్రేట్ యాక్టర్ కూడా. అతడు చేసి చూపిన దాంట్లో మేం సగం చేసినా చాలు మాకు విపరీతమైన పేరు వస్తుంది. ప్రతి యాక్టర్లో శ్రీను వైట్ల కనిపిస్తాడు సినిమాలో... చివరకు ఇలియానాలో కూడా అతడే కనిపిస్తాడు అని రవితేజ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X