విలన్ పాత్రపై రవితేజ క్లారిటీ.. రాజమౌళి మల్టీస్టారర్ సినిమాపై కామెంట్..

By Rajababu

బాహుబలి చిత్రం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్‌తో తన తదుపరి చిత్రమని చెప్పకనే చెప్పారు. అయితే ఇంకా ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. అయితే తాజాగా మల్టీస్టారర్ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..

Recommended Video

ఎన్టీఆర్-చెర్రీ మల్టీస్టారర్‌ : రవితేజ విలన్‌ ?
 విలన్ పాత్రలో రవితేజ

విలన్ పాత్రలో రవితేజ

రాజమౌళి రూపొందించే చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ లిద్దరూ బాక్సర్లుగా కనిపిస్తారట. అయితే ఈ చిత్రంలో విలన్‌ది పవర్‌ఫుల్ పాత్ర అని తెలిసింది. ఆ పాత్ర కోసం మాస్ మహారాజా రవితేజను రాజమౌళి సంప్రదించినట్టు ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది.

 రవితేజ వ్యాఖ్యలతో హైప్

రవితేజ వ్యాఖ్యలతో హైప్

టచ్ చేసి చూడు సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాను మల్టీస్టారర్ సినిమాలో నటించే అవకాశం ఉంది అని ఇటీవల మాస్ మహారాజా చేసిన వ్యాఖ్యలు మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. దాంతో రాజమౌళి చిత్రంలో రవితేజ అనే వార్త మరింత బలపడింది.

 విలన్‌గా నటించడం లేదు

విలన్‌గా నటించడం లేదు

ఇలాంటి వార్తల నేపథ్యంలో రవితేజ తన అభిమానులతో మాట్లాడుతూ.. తాను విలన్‌గా నటించడం లేదు. నన్ను ఎవరూ సంప్రదించడం లేదు అని స్పష్టం చేశారు. దాంతో రాజమౌళి సినిమాలో రవితేజ నటిస్తున్నారని ఆశతో ఉన్న ప్రేక్షకుల నిరాశే ఎదురైంది.

కసరత్తు మొదలు

కసరత్తు మొదలు

ఇదిలా ఉండగా, రాజమౌళి రూపొందించే చిత్రం కోసం రాంచరణ్, ఎన్టీఆర్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ పొందుతున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం అక్టోబర్ తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X