రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి
మాస్ మహారాజ రవితేజ, యువ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన 'డాన్ శీను' అభిమానులకు మంచి వినోదాన్ని పంచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని ప్రసాద్ వి పొట్లూరి పి.వి.పి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ నిర్మాత రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' చిత్రం తమిళ వెర్షన్ 'నాన్ ఈ'కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ విషయమై రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్లో ప్రస్తావిస్తూ...''ఇటీవల గోపీచంద్ మలినేని రవితేజకు బ్యాంకాక్‌లో కథ వినిపంచాడు. వెంటనే రవితేజ ఓకే చెప్పాడు. ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందబోతోంది. రవితేజ సినిమాల్లోనే ఇదో బెస్ట్ సినిమాగా నిలవబోతోంది. ఈ చిత్రం తర్వాత ప్రసాద్ వి పొట్లూరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మెగా ప్రొడ్యూసర్ల జాబితాలో చేరబోతున్నారు'' అని పేర్కొన్నారు.
ప్రస్తుతం రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం తర్వాత పరశురాం దర్శకత్వంలో ఓ చిత్రానికి కమిట్ అయ్యాడు. వీటితో పాటు మెహర్ రమేష్ చిత్రంలోనూ రవితేజ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈచిత్రాలు పూర్తయిన తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ మొదలయ్యే అవకాశం ఉంది.
డాన్ శ్రీను చిత్రం దర్శుకడిగా కెరీర్ ప్రారంభించిన గోపీచంద్ మలినేని ఆ చిత్రం ద్వారా మంచి పేరు తెచ్చుకోవడమే కాదు, రెండో సినిమా అగ్రహీరో వెంకటేష్‌తో చేసే అవకాశం దక్కించుకున్నాడు. వెంకీతో అతను రూపొందించిన 'బాడీగార్డ్' చిత్రం సంక్రాంతి హిట్ సినిమాల లిస్టులో చేరడంతో గోపీంద్ స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది.


Click it and Unblock the Notifications











