ఇద్దరు ప్లాప్ డైరెక్టర్లతో రవితేజ-సమ్ థింగ్ స్పెషల్..
'ఒక్కమగాడు", 'సలీమ్"లాంటి ప్లాప్ బస్టర్స్ ఇచ్చిన వైవియస్.చౌదరి నిర్మాతగా, 'సైనికుడు", 'వరుడు" లాంటి డిజాస్టర్స్ అందించిన గుణశేఖర్ దర్శకత్వం హిట్ల హీరో రవితేజ తో చేయబోతున్న లేటెస్ట్ మూవీ 'నిప్పు". ప్రస్తుతం రవితేజ చేస్తున్న 'వీర"తర్వాత ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. వరస హిట్స్ తో తన రూట్ లో ముందుకు దూసుకు పోతున్న రవితేజ గుణశేఖర్, చౌదరి ల సినిమా చెయ్యడం ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశమైంది.
ప్లాప్ ల మీద ప్లాపులిస్తున్న ఇద్దరు డైరెక్టర్లతో సినిమా చెయ్యడం అంటే నిప్పుతో చెలగాటమాడినట్టేనని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి. తన నేరేషన్ తో హీరోలను ఇట్టే పడేసే గుణశేఖర్ రవితేజను కూడా అలాగే ఒప్పించాడని తెలుస్తోంది. కథలో విషయం వుంటే గానీ ఓకే చెప్పని రవితేజ ఈ సినిమా ఓకే చేశాడంటే సమ్ థింగ్ వుండే వుంటుంది. మరి ఈ సినిమాతో చౌదరికి, గుణశేఖర్ కి పెద్ద హిట్ వస్తుందంటారా?


Click it and Unblock the Notifications











