మరో నాలుగు డబ్బులు వస్తున్నాయంటే ఆనందమే కదా...రవితేజ
చాలా సంతోషంగా ఉంది. రీమేకుల పేరుతో నా నిర్మాతలకి మరో నాలుగు డబ్బులొస్తాయి. ఇది ఆనందించే విషయమే కదా అంటూ చెప్పుకొచ్చారు రవితేజ. ఆయన నటించిన 'విక్రమార్కుడు', 'కిక్' చిత్రాలు బాలీవుడ్‌కి వెళుతున్న సందర్భగా ఆయన ఇలా స్పందించారు. అలాగే ఈ పరిణామంకి కారణం వివరిస్తూ...వినోదానికి ఎక్కడైనా ఆదరణ ఉంటుంది. అందులోనూ నా సినిమాలు వాళ్లకు కూడా నచ్చుతుంటే...ఇక చెప్పేదేముంది అన్నారు.ఆయన చిత్రం వీర ఫలితం గురించి మాట్లాడుతూ...నిజం చెప్పాలంటే...ఈ సినిమా గురించి ముందు తలో రకంగా మాట్లాడుకొన్నారు. బాగుందని కొందరు, ఓ మోస్తరుగా ఉందని మరికొందరు అన్నారు. అయితే అవన్నీ తట్టుకొని 'వీర' నిలబడింది. అందులో రెండు ఛాయలున్న పాత్ర పోషించాను. వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులకు కాస్త సమయం పట్టింది. ఇప్పుడు నిర్మాత, పంపిణీదారులు సంతోషంగా ఉన్నారు. అంతకంటే నేను కోరుకొనేది ఏముంది? అన్నారు.


Click it and Unblock the Notifications











