కొంతమంది నోటి దూల అనుకుంటారు..రవితేజ
నిజాలు మాట్లాడితే కొంతమంది నోటి దూల అనుకుంటారు. బలుపు అని కూడా అనుకునే అవకాశం ఉంది. కానీ, నాకీ రెండూ లేవు. నా మనసుకేం అనిపిస్తే అదే మాట్లాడతా అంటున్నారు రవితేజ. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా రమేష్ పుప్పాల నిర్మించిన మిరపకాయ్ ఈ సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇలా స్పంధించారు. అలాగే మిరపకాయ్్ గురించి చెబుతూ..ఈ చిత్రం ఈ రేంజ్ హిట్ అవుతుందని ఊహించలేదు. ఒకవేళ ఊహించానని చెబితే అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో ఎవరూ ఊహించలేం. ఈ సినిమా మంచి వసూళ్లు కురిపిస్తోంది. నా నిర్మాత రమేష్ పుప్పాల, బయ్యర్లు అందరూ హ్యాపీ. నాక్కావల్సింది అదే. నాతో సినిమా తీసేవాళ్లు, నా సినిమా కొనేవాళ్లు ఆనందంగా ఉంటే చాల అన్నారు. ఇక రామూతో చేస్తున్న దొంగల ముఠా ప్రయోగం సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇక వీర నా టైప్ సినిమా. బాగుంటుంది అంటూ ప్యూచర్ ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











