బ్యాంకాక్ అల్లర్లులో చిక్కుకున్న రవితేజ,పూరీ

By Staff

Ravi Teja
బ్యాంకాక్: రవితేజ,సియా కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్ తాజాగా రూపొందిస్తున్న నేనింతే సినిమా యూనిట్ బ్యాంకాక్ అల్లర్లులో చిక్కుకుంది. పాట చిత్రీకరణ కోసం యూనిట్ అక్కడికి చేరుకున్నారు.ఈ రోజు ఉదయం బ్యాంకాక్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద, నగరంలోని ఇతర ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల నేపథ్యంలో ఈ పేలుళ్లు సంభవించాయి. విమానాశ్రయం వద్ద బుధవారం ఉదయం సంభవించిన పేలుళ్లలో ఇద్దరు గాయపడ్డారు. అంతకు ముందు ఆందోళనకారుల ముట్టడితో ఆ విమానాశ్రయాన్ని మంగళవారంనాడు మూసేయాల్సి వచ్చింది. ఆందోళనకారులపైకి గ్రేనేడ్ విసిరారని, దీంతో ముగ్గురు గాయపడ్డారని రెండు స్థానిక టెలివిజన్లు తెలియజేశాయి.

ఓల్డ్ డాన్ మూయింగ్ విమానాశ్రయం వద్ద ప్రదర్శన నిర్వహిస్తున్న ఆందోళనకారులపైకి అదే సమయంలో గ్రెనేడ్ విసిరారు. ఈ సంఘటనలో ఇద్దరు గాయపడ్డారు. దీనికి సమీపంలోనే ప్రధాని తాత్కాలిక కార్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ అనుకూల ప్రదర్శకులపై గ్రెనేడ్స్ పేలడంతో ముగ్గురు గాయపడ్డారు. సెంట్రల్ బ్యాంకాక్ లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను ఆందోళకారులు ఆగస్టులో ఆక్రమించుకున్నారు. దీంతో ప్రధాని సోమ్చాయ్ వొంగ్సావత్ మూయింగ్ కు మారారు. పీపుల్స్ అలయెన్స్ ఫర్ డెమొక్రసీ ఆరు నెలలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధి పోరాటాలు చేస్తోంది. ఇక ఈ అల్లర్లులో వీరు చిక్కుకోవటంతో సిని పరిశ్రమ మొత్తం దిగ్బాంతికి గురి అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X