ఇప్పుడు హీరో రవితేజా రెమ్యునేషన్ వింటే సామాన్యులకు కళ్ళు తిరుగుతుంది.నిర్మాతలకు అయితే రక్తం మరుగుతోంది.నాలుగు కోట్లు అంటే మాటలా అంటున్నారు.ఇంతకు ముందు రెండున్నర తీసుకునేవాడు చక్కగా .ఇప్పుడు 'దుబాయి శ్రీను, కృష్ణ' సినిమాలు సూపర్ హిట్ అయ్యేసరికి ఒక్కసారిగా రెమ్యునేషన్ పెంచేసాడు అని వాపోతున్నారు . అందులోనూ శ్రీకాంత్, ఇలియానా వంటి స్టార్స్ అంతా రెమ్యునేషన్ రెట్టింపు చేయటం రవితేజాని ఇన్ స్పైర్ చేసినట్లుంది అంటూ వాళ్లనీ ఆడిపోసుకుంటున్నారు. కాని రవితేజ మాత్రం కూల్ గా ఏం నా మీద పదహారు కోట్లు వ్యాపారం జరుగుతోంది. శాటిలైటు, ఓవర్ సీస్, ఆడియో, వీడియో రైట్లు అంటూ బాగానే గుంజుతున్నారుగా ఇంకా గుణుగుతారెందుకు అంటూ విసుక్కుంటున్నాడు.ఎప్పుడైనా అంతేగా డిమాండు ని బట్టే డిమాండ్లు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే స్కీమ్స్ అంటున్నారు అనుభవజ్ఞులు .