రవితేజ ఇడియట్-2 మార్చిలో..
రవితేజ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సీక్వెల్ తీసే యోచనలో ఉన్నారనే వార్త బయటకు పొక్కడంతో అటు రవితేజ అభిమానులు, ఇటు పూరి ఫ్యాన్స్ ఇడియట్-2 సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వారి నిరీక్షణకు తెరపడినట్లే. ఈ సినిమా 2012 మార్చి 15న ప్రారంభించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా షూటింగ్ జరుపుకోనుంది.
ఈ సినిమాలో రవితేజ సరసన ఇలియాను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇలియాన ఇది వరకు ఖతర్నాక్, కిక్ చిత్రాల్లో నటించి రవితేజకు సరైన జోడీగా పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇడియట్ లాంటి రవితేజకు కత్తిలాంటి ఇలియాన అయితే పర్ ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారు దర్శక నిర్మాతలు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇడియట్ సినిమా మాదిరే ఈ ఇడిటయ్-2 సినిమాకు కూడా పవర్ ఫుల్ స్టోరీ, డైరెక్షన్, మాటలు, స్క్రీన్ ప్లే అందించేందుకు అన్ని సిద్దం చేసుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం రవితేజ గుణశేఖర్ దర్శకత్వంలో నిప్పు షూటింగులో బిజీగా గడుపుతుండగా, దర్శకుడు పూరీ మహష్ బాబుతో కలిసి బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











