ఐదు షేడ్స్‌లో రవితేజ ‘దరువు’ క్యారెక్టరైజేషన్
మాస్ మహారాజ్ రవితేజ, శౌర్యం ఫేం శివ కాంబినేషన్లో 'దరువు' అనే చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. సౌండ్ ఆఫ్ మాస్ అనే సబ్ టైటిల్ తో ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సీ కథానాయిక. ప్రస్తుతం నిరవధికంగా షూటింగ్ జరుగుతోంది.
ఈ చిత్రంలో రవితేజ గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా కనిపించబోతున్నాడు. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ గా రూపొందబోతున్న ఈ చిత్రంలో రవితేజ ఐదు షేడ్స్ విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. గతంలో విక్రమ హీరోగా వచ్చిన అపరిచితుడు సినిమాలో హీరో మూడు విభిన్నమైన పార్శ్వాల్లో కనిపిస్తాడు. అదే తరహాలో రవితేజ ఇందులో ఐదు పార్శ్వాల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు అల్లరి చిల్లర రౌడీ క్యారెక్టర్లతో కామెడీ హీరోగా కనిపించిన రవితేజ ఈ సినిమాలో తనలోని అసలైన నటుడిని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.
రవితేజ-దీక్ష సేథ్ జంటగా, గుణశేఖర్ దర్శకత్వంలో వైవిఎస్ చౌదరి బొమ్మరిల్లు బ్యానర్ పై రూపొందిన 'నిప్పు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











