ఎవడు ఎవడికి బ్యాకప్ ఇవ్వడు.. శ్రీనువైట్లపై రవితేజ షాకింగ్ కామెంట్స్..
మాస్ మహారాజా రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. టచ్ చేసి చూడు చిత్ర విశేషాలను మీడియాతో రవితేజ పంచుకొన్నారు. ఆ తర్వాత తన తదుపరి చిత్రాల గురించి వెల్లడించారు. రవితేజ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

శ్రీను వైట్లతో సినిమా
ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సెట్స్ పైన ఉంది. ఆ సినిమా పూర్తయిన తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని అనుకొన్నాను. త్వరలోనే ఆ చిత్రం విషయాలు వెల్లడిస్తాను.
Recommended Video


బ్యాకప్ ఇస్తే ఏమౌతుందో..
వరస ఫ్లాప్‌లో కొనసాగుతున్న శ్రీనువైట్ల అండగా నిలబడటానికి కాదు. సినీ పరిశ్రమలో బ్యాకప్ ఇస్తే ఏమౌతుందో దానిని చెప్పుకోవడం ఎందుకు. సినీ పరిశ్రమలో ఎవడు ఎవడికీ బ్యాకప్ ఇవ్వరు.

కథ బాగుండటం వల్లే
కథ బాగుండటం వల్లనే శ్రీనువైట్లతో చేయాలనుకొంటున్నాను. అన్ని అంశాలు చక్కగా కుదరడంతోనే శ్రీనువైట్లతో సినిమా చేయాలనుకొన్నాను. బ్యాకప్‌లు అనేవి సినీ పరిశ్రమలో సాధ్యపడవు.

శ్రీనువైట్లలో చిత్రంలో
శ్రీనువైట్లలో చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నారనే వార్తపై స్పందించడానికి నిరాకరించారు. త్వరలోనే ఆ వివరాలు మీకు తెలుస్తాయి. నా కంటే ముందే మీరే చెప్పేస్తారు కూడా.

థ్యాంక్యూ టు రాజమౌళి
బాహుబలి తర్వాత తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి మరోస్థాయికి వెళ్లింది. తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది. హీరోల మార్కెట్ పెరిగింది. థ్యాంక్స్యూ టు రాజమౌళి. నా సినిమాలు హిందీలో డబ్ అయి సెట్ మ్యాక్స్‌లో ప్రసారం అవుతున్నాయి.

ఉత్తరాదిలో క్రేజ్ చూసి షాక్
ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణ బాగా ఉంది. డార్జిలింగ్‌లో రాజా ది గ్రేట్ చిత్ర షూటింగ్ సందర్భంగా ప్రేక్షకుల ఆదరణ చూసి షాక్ తిన్నాను. ఓ దశలో నాకే అనుమానం వచ్చింది. నన్ను చూసి మరొకరు పొరపడుతున్నారనే అనుమానం కలిగింది.

ఉత్తరాదిలో నాకు క్రేజ్
మంచి కథ, బ్యానర్, అన్ని అంశాలు కుదిరితే హిందీ, తమిళ భాషలో చేయడానికి అవకాశం ఉంది. నాకు భాషపై కూడా పట్టుంది. ఉత్తరాదిలో నాకు అంతో ఇంతో క్రేజ్ కూడా ఉంది. ఇతర భాషలతో కలిపి సినిమా చేయాలని ఉంది. కానీ ప్లాన్ చేస్తే కుదరదు అని రవితేజ అన్నారు.


Click it and Unblock the Notifications











