Don't Miss!
- Sports చెన్నై సూపర్ కింగ్స్‌లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హీరోల బిల్డప్ లకి చురకలేసిన రవితేజ
మా సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని గొప్పగా చెప్పుకొనే అలవాటు నాకు లేదు. నేను మాట్లాడకూడదు. నా సినిమాలే మాట్లాడాలి. సినిమా చూసి అంతా చెప్పుకోవాలి అన్నారు రవితేజ. ఈ రోజు(గురువారం) ఆయన పుట్టిన రోజు సందర్భంగా రవితేజ మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు. ప్రతీ సినిమా విడుదలకు ముందు తమ సినిమా అలా ఉంటుంది..ఈ రేంజిలో ఆడుతుంది...ఇంతలా రికార్డులు బ్రద్దలు కొట్టేస్తుంది అని చెప్తూంటారు. ఈ తరహా హీరోలకు ఆయన ఈ కామెంట్ తో చురక వేసినట్లైంది. అలాగే నాలుగు సినిమాలు హిట్ ఇచ్చి వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి టాలెంట్ లేదని అనుకోకూడదు. ఎవరి టేలెంట్ ఎప్పుడు జనాలకు నచ్చుతుందో ఎవరూ చెప్పలేరు. చేసే ప్రతి సినిమా విజయం సాధించాలనే అనుకుంటాం. ఏ సినిమా ఎవరికి ఎందుకు నచ్చుతుందో, నచ్చలేదో చెప్పలేం అంటున్నారు రవితేజ.
అలాగే పూరి జగన్నాథ్‌తో 'దేవుడు చేసిన మనుషులు' చేస్తున్న చిత్రం గురించి చెపుతూ.. చాలా మంచి కథ. జగన్‌తో నాకిది ఐదవ సినిమా. ప్రతీ సినిమాలోనూ నా పాత్రని కొత్తగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాలోనూ అంతే కొత్తగా ఉంటుంది అన్నారు. ఇక 'దరువు'లో ఐదు రకాలుగా కనిపిస్తానని చెపుతూ.. ఐదు పాత్రలా? లేదంటే ఒకే పాత్ర ఐదు రకాలుగా కనిపిస్తుందా? ఇలాంటి విషయాలన్నీ మీరు దర్శకుడినే అడగాలి అన్నారు. ఇప్పుడు హీరోలందరూ వరుసపెట్టి సినిమాలు చేస్తుంటే ఇండస్ట్రీ కళకళలాడిపోతోంది. హెల్దీ అట్మాస్పియర్ ఉంది. మల్టీస్టారర్ కథలతో ఎవరైనా ముందుకొస్తే సినిమా చేయడానికి నేనూ సిద్ధమే. అలాగే పొరుగు భాషల వాళ్ళు సంప్రదించినా మల్టీస్టారర్‌కు నేను రెడీ అన్నారు. ఇక చిత్తశుద్ధిగా మన పని చేసుకుపోవడం హ్యాపీ. దర్శకత్వశాఖ నుంచి వచ్చాను గనుక దర్వకత్వం చేయాలన్న ఆలోచన ఉంది. కానీ ఎప్పుడో తెలియదు అని చెప్పారు. ధట్స్ తెలుగు ఈ మాస్ మహారాజాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.