మెగాస్టార్ చిరంజీవి సినిమా రీమేక్ లో రవితేజ..!
అప్పట్లో చిరంజీవి, అల్లు రామలింగయ్య కాంబినేషన్ లో రూపొందిన క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా 'మంత్రిగారి వియ్యంకుడు" చిత్రం ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకి బాపు దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి బాపు స్నేహితుడు ముళ్లపూడడి వెంకటరమణ తనయుడు ముళ్ళపూడి వర దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ రీమేక్ లో రవితేజ హీరోగా నటించనున్నాడట. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు ముళ్ళపూడి వెంకటరమణ బ్రతికున్నప్పుడే జరిగాయట. తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు ముళ్ళపూడి వర జరుపుతున్నాడని సమాచారమ్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించడానికి రవితేజ వర సిద్ధమవుతున్నారట.
More from Filmibeat
ravi teja chiranjeevi mantrigari viyyankudu mullapudi vara రవితేజ చిరంజీవి మంత్రిగారి వియ్యంకుడు మళ్ళపూడి వర


Click it and Unblock the Notifications











