మిరపకాయ్ ఘాటు సూపర్ అంటోన్న మాస్ ఫ్యాన్స్...
సంక్రాంతికి కమర్షియల్ హిట్ అయిన ఏకైక సినిమా రవితేజ 'మిరపపకాయ్". ఈ చిత్రానికి పోటీ అవుతుందని భావించిన 'పరమవీర చక్ర" కాస్తా తొలి రోజే చాప చుట్టేయడంతో పొంగల్ రేస్ లో మిగిలిన ఏకైక మాస్ స్టార్ రవితేజ అయ్యాడు. మిగిలిన రెండు చిత్రాల కథానాయకులు మాస్ ని థియేటర్లకి రాబట్టడంలో పరమ వీక్ కావడం రవితేజకి కలిసొచ్చింది.
పైగా 'అనగనగా ఓ ధీరుడు", 'గోల్కొండ హైస్కూల్" చిత్రాలకి గ్రౌండ్ బ్రేకింగ్ టాక్ ఏమీ రాలేదు. ఒకటి గ్రాఫిక్స్ పరంగా బాగుంటే, మరొక్కటి విలువల పరంగా స్కోర్ చేసింది. దాంతో మాస్ జనానికి కేవలం 'మిరపకాయ్" మాత్రమే ఘాటుగా అనిపించింది. అంతే రవితేజ పంట పండిపోతోంది. రవితేజ సినమాల్లోనే అత్యధిక ఓపెన్సింగ్స్ సాధించిన ఈ చిత్రం మరో సరైన ప్రత్యర్థి ఎదురయ్యే వరకు జైత్రయాత్ర సాగిస్తుంది.
ప్రతి సినిమాని మూసలో చేసుకుపోతున్న మాస్ మహరాజ్ రవితేజకి ఈ పద్దతి బాగానే కలిసొస్తోంది. రవితేజతో 'డాన్ శీను" చిత్రానికి దర్శకత్వం వహించిన గోపిచంద్ మలినేని ఈ హీరోకి 'మాస్ రాజా" అని బిరుదు ఇచ్చేసాడు. కాగా మిరకపకాయ్ చిత్రానికి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ అయితే ఏకంగా ఈ హీరోగారికి 'మాస్ మహారాజా" అని బిరుదు ఇచ్చేసాడు. ఈ బిరుదులు నాకు వద్దు అని రవితేజ వారితో అంటుంటాడట. పైపైకి వద్దన్నా..లోలోపల మాత్రం ఈ బిరుదులకు రవితేజ ఆనందపడిపోతున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











