డాన్ శీను 'పులి' దెబ్బకు నిలబడుతాడా...!?
పవన్ కళ్యాణ్ పులి విడుదల డిలే అవుతూనే వస్తోంది. ప్రస్తుతం ఆడియో రిలీజ్ అంటూ ఒక కొలిక్ కు వచ్చింది. మరి విడదల ఆగస్ట్ 15 అని సమాచారం. అయితే రవితేజ, శ్రియ జంటగా నటిస్తోన్న చిత్రం 'డాన్ శీను" కూడా అదే టైమ్ లో రిలీజ్ అవ్వోచ్చని సినీ ఇండస్టీ టాక్. అదే నిజమైతే పులితో డాన్ శీను తలపడనున్నాడన్నమాట. మరియైతే ప్రస్తుతం డాన్ శీను స్టేటస్ లోనికివెలితే..
వెంకట్ నిర్మాణ సారద్యంలో ఆర్ ఆర్ మూవీ మేకర్ బ్యానర్ లో రవితేజ, శ్రియ జంటగా రూపొందుతోన్న 'డాన్ శీను" చిత్రం పైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. కాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రామలు కూడా వేగంగా జరగుతున్నాయి. జూలై 15వ తేది నుంచి ఈ చిత్రానికి సంబంధించిన డిటియస్ వర్క్ హైదరాబాద్ లోని శబ్ధాలయా థియేటర్లో జరగనుందని సమాచారమ్. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఆగస్ట్ 6న చిత్రవిడుదలకు సన్నాహాలు సిద్దం చేస్తోందని కూడా సమాచారం. అయితే అభిమానులు మాత్రం రెండు మాస్ సినిమాలు విడుదలతో చాలా సంతోషంగా ఉన్నట్టు సమాచారం. ఈ రెండింటిలో ఏ మాస్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాడో వేచి చూడాల్సింది.


Click it and Unblock the Notifications











