twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాస్ మహరాజా ‘రవితేజ’ కు ఫ్యానైపోయిన డైరెక్టర్...

    By Sindhu
    |

    నేను రవితేజ ఫ్యాన్‌ ను అని 'మిరపకాయ్" సినిమా యంగ్ డైరెక్టర్ హరిష్ శంకర్ అన్నారు. 'సింధూరం' సినిమా చూసి ఆయనకు మరింత ఫ్యాన్‌ అయ్యాను. నేను స్వతహాగా ఎన్‌.టి.ఆర్‌. అభిమానిని. ఆ తర్వాత చిరంజీవి అభిమానిని. పెద్దహీరోలను డైరెక్ట్‌ చేయాలంటే కుదరదు గనుక. వారికి పార్లల్‌ గా మరో హీరోను ఎన్నుకోవాలి. ఆ టైమ్‌ లో 'సింధూరం' చిత్రాన్ని చూసి చాలా ఎనర్జిటిక్‌ గా ఉన్నాడని ఫ్యాన్‌‌ ను అయ్యాను. అప్పటినుంచి ఆయనతో టచ్‌ లో ఉండేవాడిని. ఆయన చిత్రాలకు అసిస్టెంట్‌ గా కూడా పనిచేశాను. ఆయన ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని కథలు రాసేవాడిని. అలా ఆయన బాడీ లాంగ్వేజ్‌ నాలో కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. నేను రమేష్‌ గారికి కథ చెప్పినప్పుడు.. వెంటనే ఆయన... ఈ క్యారెక్టర్‌ రవితేజ అయితే బాగా చేస్తాడని ఆయనే చెప్పారు.

    రవితేజగారి సహకారం లేనిదే సినిమా తీసేవాడిని కాదు. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభ సీన్‌ ఎండలో తీయాల్సి ఉంది. అంతకుముందు రోజే 'డాన్‌ శీను' షూటింగ్‌ స్విట్జర్లాండ్‌ లో జరిగితే వచ్చారు. వెంటనే ఎండలో ఫైట్స్‌ చేయాలి. ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఎండలో సైతం ఆయన ఫైట్స్‌ చేశారు. ఎంత రిస్క్‌ షాట్‌ చేసినా ఆ తర్వాత చాలా జోవియల్‌ గా ఉంటూ అందర్నీ నవ్విస్తారు. ఆ ఎనర్జీ మాలో కూడా ఉంటుంది. ఆయన జన్మించి ఎంతమందికి మేలు చేశారో తెలీదు కానీ.. నాకు మాత్రం సినీజన్మనిచ్చారు. ఆయనకు రుణపడి ఉంటాను. మాస్‌ మహారాజాగా ఆయన ఇంకా ఎన్నో చిత్రాలు చేయాలి. అప్పుడే రిటైర్‌ అవ్వకూడదు అని కోరుకుంటున్నాను.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X