మాస్ మహారాజ్ రవితేజ ‘కోతి’
అభిమానులకు అతడు మాస్ మహారాజ్...ఆవిడకు మాత్రం కోతి. మీరు ఊహించింది నిజమే ఇక్కడ మాట్లాడేది రవితేజ గురించే. రవితేజను కోతి అంటూ కామెంట్స్ చేసింది ఎవరో తెలుసా? ఇంకెవరు సన్న నడుము జాన 'ఇలియానా'.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఇలియానాను ఓ కొంటె ప్రశ్న వేసింది. మీరు చాలా మంది హీరోలతో పని చేశారు కాదా, మీకు ఏ హీరో బెస్ట్ అనిపించారు? ఎవరితో స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది? ఎవరితో మీరు కంఫర్టబుల్ గా ఫీలయ్యారు? అని అడిగిందట. దీనికి ఇలియానా రిప్లయ్ ఇస్తూ....''మీరు చాలా చెడ్డ ప్రశ్న అడిగారు. మీరు ఇలాంటి కష్టమైన ప్రశ్న అడిగితే చెప్పడం కష్టం. నాతో కలసి నటించిన అందరు హీరోలు మంచి వారు, అందరూ స్మార్ట్ గానే ఉంటారు. అయితే నేను చాలా ఎంజాయ్ చేసింది మాత్రం రవితేజతోనే, అతడు చాలా ఫన్నీగా ఉంటాడు. ఎప్పుడూ కోతిలా అల్లరి చేస్తూ ఎంటర్ టైన్మెంట్ చేస్తుంటాడు'' అని చెప్పుకొచ్చింది.
నన్‌బన్ విజయంతో మంచి జోరు మీద ఉన్న ఇలియాన తర్వలో పూరి జగన్నాథ్ దర్వకత్వంలో రవితేజతో కలిసి మరోసారి రొమాన్స్ చేయనుంది. ప్రస్తుతం ఇలియాన త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జన్‌తో నటిస్తోంది. మరో వైపు బాలీవుడ్‌లో బర్ఫీ చిత్రంలో నటిస్తోంది. రవితేజ ప్రస్తుతం 'నిప్పు' విడుదలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. దీని తర్వాత 'దరువు' చిత్రంలో, అనంతనరం 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో నటించనున్నాడు.


Click it and Unblock the Notifications











