రవితేజకు వర్మ షాక్ ఇవ్వటానికేనా ఇదంతా?
టాలీవుడ్ లో నా ఫేవరెట్ ఆర్టిస్ట్ రవితేజ..అన్నారు రామ్ గోపాల్ వర్మ మిరపకాయ ఆడియో పంక్షన్ కి గెస్ట్ గా హాజరై. అలాగే రవితేజ..వర్మ నా ఇష్టం పుస్తకం ఆవిష్కరణకు గెస్ట్ గా హాజరై..నా ఇష్టం అంకితం నాకే..అందుకే ఆయనంటే నాకు ఇష్టం అని స్టేజిపై చెప్పారు. అంతేగాక వర్మ సంభందం లేకపోయినా రవితేజని ఉద్దేశ్శించి నా ఇష్టం స్టేజిపై హైదరాబాద్ లో నేను ఎక్కువ ఇష్టపడేది, కలిసేది రవితేజనే అని ప్రకటించారు. ఆ పంక్షన్ జరిగిన రెండు రోజులకు రవితేజ ఓ పత్రికకు ఇంటర్వూ ఇస్తూ..వర్మ దర్శకత్వంలో చేయాలనేది నా చిరకాల కోరిక అన్నారు. ఇవన్నీ చూస్తూంటే వర్మ, రవితేజ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకునే అవకాసం కనపడుతోంది అంటున్నారు. గతంలో వర్మ నిర్మాతగా హరీష్ శంకర్(ఈయనా వర్మ శిష్యుడే) దర్శకత్వంలో షాక్ చిత్రం రూపొంది భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు మళ్ళీ వర్మ..తన బ్యానర్ లో తన దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారని, అయితే ఆ చిత్రం అప్పలరాజు విడుదల అయ్యాక ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











