నా అభిమాన తెలుగు హీరో అతనే...ఇలియానా
"చాలా మంది హీరోలతో కలిసి నటించినప్పటికీ రవితేజ నా అభిమాన హీరో అని చెప్పగలను. ఆయనతో కలిసి పనిచేస్తుంటే అలసట అన్నది తెలియకుండా పోతుంది" అని ఇలియానా చెప్పుకొచ్చింది. రవితేజతో కలిసి ఆమె నటించిన 'కిక్' చిత్రం 2009 సంవత్సరంలో విడుదలైన అతి పెద్ద హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. ఇక ఇలియానా తన విజయ రహస్యం చెపుతూ.."ఎలాంటి హోమ్ వర్క్ లేకుండానే సెట్స్ లో అప్పటికప్పుడు నటించటానికి నేను ఇష్టపడతాను. అందుకే సినిమాల్లో నా భావోద్వేగాలు చాలా సహజంగా ఉంటాయి" అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇలియానా ఎన్టీఆర్ సరసన 'శక్తి'లో చేస్తోంది. అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'నేను నా రాక్షసి' చిత్రంలో రాణా సరసన చేస్తోంది. మహేష్ సరసన త్రీ ఇడియట్స్ రీమేక్ చేయటానికి కమిటయ్యింది.


Click it and Unblock the Notifications











