రవితేజను హాలీవుడ్ హీరోతో పోల్చిన హన్సిక
హైదరాబాద్: రవితేజ సరసన 'పవర్' సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న హీరోయిన్ హన్సిక రవితేజపై పొగడర్తల వర్షం కురిపిస్తోంది. రవితేజ సార్ నాకు చాలా కాలంగా తెలుసు, ఆయన ఎంతో ఉదారత కలిగిన వ్యక్తి, టాలీవుడ్‌కి జిమ్ కారీ లాంటి వారు అంటూ గొప్పగా చెబుతోంది. హన్సిక ప్రస్తుతం తెలుగు, తమిళంలో దాదాపు 10 సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.
రవితేజ-హన్సిక పవర్ సినిమా వివరాల్లోకి వెళితే...
మాస్ మహారాజ రవితేజ హీరోగా రాకలైన్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి పతాకంపై కె.ఎస్.రవీంద్రనాథ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'పవర్'(అన్ లిమిటెడ్). ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

రవితేజ సరసన హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రిషి, రావు రమేష్, మిర్చి సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖా వాణి, జోగి బ్రదర్స్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : ఎస్ఎస్. థమన్, ఫోటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటర్: గౌతం రాజు, మాటలు : కోన వెంకట్, స్ర్కీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, కో డైరెక్టర్: నందగోపాల్ కురుళ్ల, ప్రొడక్షన్ కంట్రలర్: పి.ఎ.కుమార్ వర్మ, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్(బాబి).


Click it and Unblock the Notifications











