twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాస్ మహారాజా రవితేజ ‘వీర’ మే మూడో వారంలో...!

    By Sindhu
    |

    మాస్ మహారాజా రవితేజ హీరోగా రైడ్ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన రమేష్ వర్మ దర్శకత్వంలో శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'వీర'. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ లో క్లైమ్యాక్స్ జరుగుతోంది.

    ఈ సందర్భంగా నిర్మాత గణేష్ ఇందుకూరి చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'హైదరాబాద్ లో చాలా భారీ ఎత్తున క్లైమ్యాక్స్ జరుగుతోంది. ఈ నెల 30 నుండి రెండు పాటల కోసం యూరప్ వెళ్తున్నాం. రవితేజ, కాజల్ పై రెండు పాటలు చిత్రీకరించడం జరుగుతుంది. మే మొదటి వారంలో ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదల చేసి మే మూడో వారంలో సినిమా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం' అనంరు.

    దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ 'రవితేజ కెరీర్ లోనే 'వీర' సెన్సేషనల్ ఫిలిం అవుతుంది. హై టెక్నికల్ వేల్యూస్ తో చాలా లావిష్ గా ఈ చిత్రం రూపొందుతోంది. నిర్మాత గణేష్ ఇందుకూరి ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా చాలా భారీగా నిర్మిస్తున్నారు' అన్నారు. 'కిక్" శ్యామ్, శ్రీదేవి, నాగబాబు, రోజా, కృష్ణుడు, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, హేమ, దివ్యవాణి, సుప్రీత్, సుబ్బరాజు, అజయ్, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, రచన: పరుచూరి బ్రదర్స్.

    English summary
    Mass Maharaja Ravi Teja is acting as a main lead in the movie directed by ravi Varma(Ride fame) produced by Ganesh Indukuri under tha banner Sanvi Productions. The climax is being shot in Hyderabad as of now. and from 30th of this month we will be going to Europe to shoot 2 songs. Ravi teja and Kajal Agarwal will be featuring in the 2 songs Music is expected to release by aditya music in the first week of may and movie is expected to release in the 3 rd week of may.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X