పది రోజుల పాటు యూరప్ లో రవితేజ, కాజల్ డ్యూయెట్...
శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇంటూరి నిర్మిస్తున్న చిత్రం"వీర". ఈ చిత్రం మూడు పాటలు మినహా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. మిగిలిన మూడు పాటలను కూడా పూర్తి చేసి సినిమాను మే చివరి వారం లేదా జూన్ నేలలో విడుదల చేయడానికి సినిమా రూపకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో బాగంగానే ఏప్రిల్ 20 నుండి మారిషెస్ లో తాప్సి, రవితేజల ఫై ఓ పాటను చిత్రీకరించనున్నారు.
మిగిలిన రెండు పాటలను రవితేజ, కాజల్ పాల్గొనగా యూరప్ లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ షెడ్యూల్ మే 1 నుండి 10 వరకు కొనసాగుతుందని సమాచారం. ఈ పాటలు రాజు సుందరం నృత్య దర్శకత్వంలో తెరకెక్కనున్నాయి. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న వీర చిత్రానికి సంగీతం తమన్. రవితేజ రెండు పవర్ ఫుల్ పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీ 2 హాలీ బ్యానర్ ఫై గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో ఈ చిత్రం హై బడ్జెట్ చిత్రంగా నిర్మింపబడుతోంది.


Click it and Unblock the Notifications











