Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu : ఈ రోజు మీకు శుభమా లేదా అశుభమా ఎలా ఉంటుంది? ఏఏ రాశులకు ఎలా ఉంటుంది
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
Khiladi Movie OTT: ఆ ఓటీటీలో ఖిలాడి స్ట్రీమింగ్.. డేట్‌ను ప్రకటించిన బడా సంస్థ
గత ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'క్రాక్' మూవీతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు మాస్ మహారాజా రవితేజ. ఈ చిత్రం అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో.. ఈ స్టార్ హీరో అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా ఉన్నాడు. ఈ జోష్‌తోనే రవితేజ 'ఖిలాడి' అనే సినిమాలో నటించాడు. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చింది. ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకుని ఫిబ్రవరి 11వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.
అయితే, ఆరంభం నుంచే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావాన్ని చూపించింది. దీంతో ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఖిలాడి' డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

ఖిలాడిగా ఎంట్రీ ఇచ్చిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించిన సినిమానే ‘ఖిలాడి'. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
షర్ట్ విప్పేసి ప్రియాంక చోప్రా హాట్ ట్రీట్: పైనుంచి అందాలను చూపిస్తూ ఘాటుగా!

రవితేజ కెరీర్లోనే ఎక్కవ మొత్తం
‘ఖిలాడి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.50 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్లో రూ. 1.20 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు బిజినెస్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే.. దీనికి మొత్తంగా రూ. 22.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇది రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ బిజినెస్‌లలో ఒకటిగా నిలిచింది.

టాక్ వచ్చినా.. రెస్పాన్స్ రాలేదు
మాస్ మహారాజా రవితేజ - రమేష్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘ఖిలాడి' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. ఇక, ఆరంభంలోనే ఈ చిత్రానికి మంచి టాక్ కూడా దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతాయని అంతా అనుకున్నారు. కానీ, ఇది బాక్సాఫీస్ ముందు అంతగా రాణించలేదు.
ప్రియుడితో బెడ్‌పై శృతి హాసన్ రచ్చ: కరోనా ఉన్నా అలాంటి పనులు చేస్తూ!
నిర్మాతలకు నష్టాలు తప్పలేదు
క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ఖిలాడి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23.50 కోట్లుగా నమోదైంది. ఈ సినిమా ఇప్పటి వరకూ రూ. 15 కోట్లు కూడా వసూలు చేయలేదు. దీంతో నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు ఎదురైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఆ ఓటీటీలో ఖిలాడి స్ట్రీమింగ్
ఎన్నో అంచనాలతో వచ్చినా ‘ఖిలాడి' మూవీ ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకోవడంలో విఫలమైంది. దీంతో చాలా తక్కువ రోజులు మాత్రమే థియేటర్లతో సందడి చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి చాలా రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్పై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అధికారిక ప్రకటనను వదిలింది.
టాప్ తీసేసి రచ్చ చేసిన ఈషా రెబ్బా: క్లోజప్‌లో అందాలను చూపిస్తూ యమ హాట్‌గా!

ఖిలాడి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ‘ఖిలాడి' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ముందుగా ఒప్పందం చేసుకున్న దాని ప్రకారం ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత అంటే మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా సదరు సంస్థ విడుదల చేసింది.