twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ, కృష్ణవంశీల 'కందిరీగ' ఎప్పటినుంచి?

    By Srikanya
    |

    రవితేజ, కృష్ణవంశీ కాంబినేషన్ లో 'కందిరీగ' అనే చిత్రం పూజా కార్యక్రమాలు కొద్ది నెలల క్రిందట జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలవనున్నది. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారు. ఆయన ప్రస్తుతం రవితేజతో నానోడిగల్ చిత్రం రీమేక్ శంభో..శివ..శంభో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సముద్ర ఖని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రవితేజతో పాటు అల్లరినరేష్ కూడా కనిపించనున్నాడు. 2010 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది.

    ఇక చారిత్రక నేపథ్యంలో సోషియో ఫాంటసీగా రూపొందనున్న ఈ కందిరీగ చిత్రంలో రవితేజ శ్రీకృష్ణ దేవరాయులు ముని..ముని మనవడుగా కనిపించనున్నాడు. ఆ గొప్ప చక్రవర్తి వారసుడు ఈ కాలంలో ఏం చేస్తున్నాడు అన్నదానికి ఓ బర్నింగ్ ఇష్యూని ముడేసి కృష్ణవంశి సినిమా చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. పూర్తి స్దాయి ఎంటర్టైనర్ గా సాగే ఈ కథలో రవితజ రెగ్యులర్ విరుపులకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది. ఈ చిత్రం వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక రవితేజ, కృష్ణవంశి కాంబినేషన్ లోగతంలో 'సింధూరం','ఖడ్గం' వచ్చాయి. ఈ చిత్రం తర్వాత ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న సినిమాకి కూడా రవితేజ కమిట్ అయ్యారు. ఫ్రిబవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు ప్లానింగ్ జరుగుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X