కృష్ణ వంశి ,రవి తేజ ఫైట్?
కృష్ణ వంశి దర్సకత్వంలో, రవితేజ హీరోగా చేసే చిత్రానికి ఫైట్ అనే పేరు పెట్టనున్నట్లు సమాచారం. బాలకృష్ణ అంటే వీరాభిమానం ప్రకటించే బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తతం ఆంజనేయులు షూటింగ్ లో బిజీగా ఉన్న రవితేజ దాని తర్వాత ఈ చిత్రమే చేయనున్నట్లు సమాచారం. అలాగే కృష్ణవంశి కూడా మహాత్మ అనంతరం ఏ ప్రాజెక్టు కమిట్ కాలేదు. ఇంతకుముందు రెండు మూడు సార్లు కృష్ణవంశితో రవితేజ చిత్రం చేయాలని ప్లాన్ చేసారు. కథ కుదరక ఒకసారి, డేట్స్ కుదరక మరో సారి, వేరే కమిట్ మెంట్స్ తో మరోసారి వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ఈ సారి కన్ఫర్మ్ గా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆంజనేయులు చిత్రాన్ని యువత దర్శకుడు పరుశరామ్ డైరక్ట్ చేస్తున్నాడు.
నయనతార..ఈ చిత్రంలో రవితేజకి జోడిగా చేస్తోంది. బెల్లంకొండ రైడ్ చిత్రం జూన్ ఐదున రిలీజ్ అవుతోంది. ఖడ్గం తర్వాత వీరి కాంబినేషన్లో రానున్న చిత్రంపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. ఇంతకు ముందు రవితేజతో బెల్లంకొండ నా ఆటోగ్రాఫ్ చిత్రాన్ని నిర్మించారు.మరో ప్రక్క బెల్లంకొండ సురేష్ ..బాలయ్య తో భీష్మ అనే చిత్రాన్ని తీస్తున్నారు. రైడ్ చిత్ర దర్శకుడు రమేష్ వర్మ దీనిని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఒకేసారి షూటింగ్ లు జరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











