రవితేజ-పరశురామ్-అశ్వినీదత్ మూవీ జులై 1 నుంచి
మాస్ మహరాజా రవితేజ హీరోగా వైజయంతి మూవీస్ పతాకంపై పరశురామ్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ రూపొందిస్తున్న చిత్రం షూటింగ్ షెడ్యూలర్ ఖరారైంది. ఈ మేరకు వైజయంతి మూవీస్ నుంచి అధికారిక సమాచారం వెలువడింది.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జులై 1 నుంచి ఊటీలో జరుగనుంది. ఈ చిత్రంలో కాజల్ అగ్వరాల్, రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ బాడీ లాంగ్వేజ్‌కి తగినట్లుగా ఒక మచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా రూపొందబోతోంది. యాక్షన్ తో పాటు మంచి ఎంటర్ టైన్మెంట్స్ హై టెక్నిక్ వ్యాల్యూస్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
యువత, సోలో చిత్రాలు దర్శకత్వం వహించిన పరశురాం దర్శకుడు. గతంలో పరశురాం దర్శకత్వంలో రవితేజ హీరోగా 'ఆంజనేయులు' చిత్రం రూపొందింది. అయితే ఆ చిత్రం నిరాశ పరిచింది. ఈ చిత్రానికి 'సార్ వస్తారా' అనే టైటిల్ పెడుతున్నట్లు కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నా ఇంకా ఖరారు కాలేదు. ఈచిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, నిర్మాత: అశ్వినీదత్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: పరశురామ్
ప్రస్తుతం రవితేజ- పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇందులో రవితేజ సరసన ఇలియాన నటిస్తోంది. పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాడు క్రేజీ డైరెక్టర్ పూరి. ఇక రవితేజ నటించిన 'దరువు' ఇటీవల విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











