»   » 'ప్రేమ అనే పేడ, గోడకి కొడితే పిడక అవ్వుద్ది' అంటున్న రవితేజ

'ప్రేమ అనే పేడ, గోడకి కొడితే పిడక అవ్వుద్ది' అంటున్న రవితేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ప్రేమ అనేది పేడ లాంటిది. గుండ్రంగా చుడితే గొబ్బెమ్మ అవుతుంది. నీళ్లలో కలిపితే కల్లాపి అవుతుంది. గోడకి కొడితే పిడక అవ్వుద్ది"... అంటున్నారు రవితేజ. గతంలో రవితేజతో షాక్ చిత్రం రూపొందించిన హరీష్ శంకర్ దర్సకత్వంలో రెడీ అయిన 'మిరపకాయ్‌' చిత్రంలో ఈ డైలాగు ఉంటుంది. దీని గురించి దర్సకుడు హరీష్ మాట్లాడుతూ...మా హీరోకి ప్రేమ మీద ఉన్న గొప్ప అభిప్రాయాల్లో ఇదీ ఒకటి. ఇంకా చాలా ఉన్నాయి. అవేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేసారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని నిర్మాత రమేష్‌ పుప్పాల నిర్మించారు. ఆయన మాట్లాడుతూ..మా చిత్రంలో హీరో తీరు మిరపకాయ్‌ ఘాటును పోలి ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఇక మిరపకాయ్ పాత్రలో రవితేజ చక్కగా ఒదిగిపోయారు. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ పాత్రలూ యుత్ కి బాగా పడతాయనే నమ్మకముంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: రామ్ ‌ప్రసాద్‌.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu