మనసులో మాట: పవన్ కళ్యాణ్ విషయంలో రవితేజ కోరిక తేరేనా?
మాస్ మహారాజా రవితేజ ఇటీవల ఇంటర్వూలో పవన్ కళ్యాణ్‌తో చేయాలని ఉందని వ్యాఖ్యానించారు. పవన్ యాటిట్యూడ్, కామెడీ టైమింగ్ బావుంటుందని, ఆయనో చేయాలని ఉందనే మనసులో మాట బయట పెట్టారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఫాలోయింగ్ కేవలం ప్రేక్షకుల్లో మాత్రమే కాదు, సినీ స్టార్స్‌లో కూడా చాలా ఉంది. ఆయనంటే ఇష్టపడే హీరోలు, ఆయనతో కలిసి సినిమా చేయాలనుకునే స్టార్లు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అలా ఎదురు చూసే వారిలో రవితేజ కూడా ఉన్నారు.
Recommended Video

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రవితేజ తన మనసులో మాట బయట పెట్టారు. 'రాజా ది గ్రేట్' సినిమా విజయంతో మంచి జోష్ మీద ఉన్న రవితేజ..... తెలుగులో ఏ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఇష్టపడతారు? అనే ప్రశ్నకు వెంటనే పవన్ కళ్యాణ్ అంటూ సమాధానం ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ సూపర్
పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, కామెడీ టైమింగ్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనతో నా కాంబినేషన్ బావుంటుందని తాను అభిప్రాయ పడుతున్నట్లు రవితేజ వెల్లడించారు.

రవితేజ కోరిక తీరేనా?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ‘జనసేన పార్టీ' కార్యకలాపాల మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. క్రమక్రమంగా సినిమాలు చేయడం కూడా తగ్గిస్తున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ కోరిక అసలు తీరుతుందో? లేదో? కాలమే నిర్ణయించాలి.

మళ్లీ పుంజుకున్న మాస్ మహారాజా
ఆ మధ్య వరుస ప్లాపులతో కుదేలైన రవితేజ.... మంచి కథ దొరకిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో దాదాపు రెండేళ్ల గ్యాపు తీసుకున్నారు. ‘రాజా ది గ్రేట్' సినిమా ద్వారా విజయం అందుకుని మళ్లీ ఫాంలోకి వచ్చారు.

డిఫరెంట్‌గా సినిమాలు ఎంచుకుంటున్న రవితేజ
రోటీన్ సబ్జెక్టులు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేక పోవడంతో డిఫరెంటుగా ఉండే కథలను మాత్రమే రవితేజ ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం రవితేజ ‘టచ్ చేసి చూడు' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











