చిరుకు దూరమైన రవితేజ?

ఇక ఇప్పటి దాకా ఎటువైపూ ముద్రవేయించుకోని వెంకటేష్ ఏ పార్టీకీ వెళ్ళడనీ ఓ ప్రక్క ప్రచారం జరుగుతూంటే...రవితేజ పరిస్దితి మరోలా ఉంది. రవితేజ ఇన్నాళ్ళూ చిరంజీవి వర్గీయుడుగా పరిశ్రమలో పేరు సంపాదించాడు. ఓ ప్రక్క శ్రీకాంత్..మరో ప్రక్క రవితేజ అన్నంతగా పరిస్ధితి వచ్చింది. అయితే రవితేజ.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటినుండీ అటు వైపు అడుగు వెయ్యటం లేదు.
ఏ ఛానెల్ కీ వెళ్ళి రాజకీయం మాట్లాడటం లేదు. ఎవరన్నా ఈ టాపిక్ షూటింగ్ సమయంలో ఎత్తితే సున్నితంగా కట్ చేస్తున్నాడు. దాంతో ఇదంతా చూసిన వారు రవితేజ కి దూరదృష్టి ఎక్కువేనంటున్నారు. ఒక పార్టీ వైపు వెళ్ళి మిగతా వారికి విరోధమయ్యే కన్నా న్యూట్రల్ గా ఉండటం పరిష్కారమనుకుంటున్నాడని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











