పవన్ కళ్యాణ్‌ని కలిసిన రవితేజ... కారణం ఏమిటి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం సెట్స్‌ని రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని సందర్శించారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అమీర్ పేటలోని సారథి స్టూడియోలో జరుగుతుండటంతో ప్రముఖుల తాకడి పెరిగింది. ఇటీవల మెహర్ రమేష్, కోన వెంకట్ వచ్చి పవర్ స్టార్‌ను కలవగా...తాజాగా రవితేజ వచ్చి పవన్‌తో కాసేపు ముచ్చటించి వెళ్లారు.
రవితేజ రాకకు కారణం 'గబ్బర్ సింగ్' చిత్రం భారీ విజయం సాధించడమే. తెలుగు సినిమా చరిత్రలోనే గబ్బర్ సింగ్ నెం.1 హిట్ చిత్రంగా నిలవడంతో పవర్ స్టార్‌ను కలిసి అంతా అభినందిస్తున్నారు. పైగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' షూటింగ్ దగ్గర్లోనే జరుగుతుండటంతో వీలు చిక్కినప్పుడల్లా అలా వెళ్లి వస్తున్నారంతా.
'గబ్బర్ సింగ్' ఇటీవలే 306 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 81 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలోనే ఇది బిగ్గెస్ట్ రికార్డు. గబ్బర్ సింగ్ దెబ్బకి మెగా బ్లాక్ బస్టర్ 'మగధీర' చిత్రం కూడా రెండో స్థానంలోకి వెళ్లింది. సీడెడ్, ఆంధ్రా టెర్రిటరీల్లో మినహా కలెక్షన్ల పరంగా నైజాం, ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియాల్లో గబ్బర్ సింగ్ పైచేయి సాధించింది.
కెమెరామెన్ గంగతో చిత్రం విశేషాలకు వస్తే...పూరి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం పవన్ అభిమానులు మెచ్చే అన్ని అంశాలతో రూపొందుతోంది. పవన్ సరసన తమన్నా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టెబర్ 18న ఈచిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











