డిల్లీ వెళ్ళిన రవితేజ 'మిరపకాయ'
'డాన్ శీను' రవితేజ తాజా చిత్రం 'మిరపకాయ'. ఈ చిత్రం షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. అక్కడ ఒక పాట, కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేస్తారు. గతంలో రవితేజకు 'షాక్' తినిపించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్‌పై రమేష్ పుష్పాల నిర్మిస్తున్నారు. ఇందులో రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్ హీరోయిన్లు. రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథ అనీ, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కథనమనీ దర్శకుడు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











