ఆ హాస్పిటల్ చుట్టూ రవితేజ చక్కర్లు కొడుతున్నది ఎవరికోసమంటే...?
గత రెండు రోజులుగా హీరో రవితేజ హైదరాబాద్ లోని కష్ణానగర్ సమీపాన ఉన్న నిఖల్ హాస్పిటల్ లో తిరుగుతున్నాడెందుకబ్బా అని ఆరా తీస్తే..అది వైద్యం చేయించుకోవడానికో, లేక ఎవరినైనా పరామర్శించడానికో కాదు. అయినా తనకు వైద్యం చేయించుకోవాల్సి వస్తే, ఒక్కో సినిమాకు 5కోట్లు పారితోషికం తీసుకునే రవితేజ..అపోలో, గ్లోబల్ వంటి అత్యంత ఖరీదైన హాస్పిటల్స్ లో చేరతాడే తప్పు..ఓ మీడియం రేంజ్ హాస్పిటల్ లో ఎందుకు చేరతాడు? ఇక హాస్పిటల్ లో అడ్మిట్ అయిన వారినెవరినైనా రవితేజ పరామర్శించడం అన్నది కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకంటే మానవ సంబందాలన్నీ ఆర్థిక సంబంధాలే" అని ఆయన చాలా బలంగా విశ్వసిస్తాడు.
రెండు రోజులు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని కానీ, అమూల్యమైన రెండు రోజుల కాలాన్ని వృథా చేసుకుని కానీ, హాస్పిటల్ లో అడ్మిట్ అయినవారిని పరామర్శించడం అనే పిచ్చి పని రవితేజ చేయడు గాక చేయడు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తన తోడబుట్టిన తమ్ముళ్లను విడుదల చేసేందుకు రవితేజ ఎంతమాత్రం ఆసక్తి చూపలేదు. చట్టం తన పని తాను చేసుకుపోకుండా అడ్డుపడడమంత అవివేకం మరొకటుండదని భావించేంత పెద్ద మనుసు రవితేజ స్వంతం.
మరింతకీ దేనికోసం గత రెండు రోజులుగా రవితేజ పైన పేర్కొనబడిన హాస్పిటల్ లో తిరుగుతున్నాడంటే..అది 'మిరపకాయ" చిత్రం షూటింగ్ కోసం. అందరికీ షాక్ ల మీద షాక్ లిచ్చే రాంగోపాల్ వర్మకే 'షాక్" చిత్రంతో షాక్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన 'లీడర్" పాప రిచా గంగోపాధ్యాయ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











