హీరో రవితేజగారికి ప్రత్యేక కృతజ్ఞతలు

By Srikanya

రవితేజ హీరోగా ఎల్లోఫ్లవర్స్ పతాకంపై హరీష్‌శంకర్ దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మించిన మిరపకాయ్ చిత్రం 50 రోజులు చిత్రం 114 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ మాట్లాడుతూ ' మా సంస్థ నిర్మించిన తొలి చిత్రం ఇంత పెద్ద హిట్ కావడానికి కారకులైన రవితేజగారికి, దర్శకుడు హరీష్‌శంకర్‌గారికి, ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు.త్వరలో అర్థ శతదినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తాం' అన్నారు.'ఈ చిత్రం విజయవంతమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సక్సెస్ క్రెడిట్ దర్శకుడు హరీష్‌శంకర్‌దే అన్నారు. ఇక రవితేజ మాట్లాడుతూ...ఈ సినిమాతో నిర్మాత రమేష్ నాకు మంచి స్నేహితుడయ్యారు' అన్నారు . చిత్ర దర్శకుడు హరీష్‌శంకర్ మాట్లాడుతూ 'నా తొలి సినిమా 'షాక్' రిజల్ట్‌తో నిరాశ చెందిన నాకు మరో సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చిన రవితేజగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నిర్మాత రమేష్‌గారు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర విజయానికి సహకరించిన యూనిట్‌కు కృతజ్ఞతలు' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X